యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్, మోటకొండూరు మండలాలకు బునాదిగాని కాల్వ ద్వారా సాగునీరు అందించిన తర్వాతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత పేర్కొన్నారు. మండలంలోని లింగరాజుపల్లి, తుక్కాపురం, కప్రాయిపల్లి గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాలను గురువారం ఆమె ప్రారంభించారు.
సీఎం కేసీఆర్ ప్రజల అవసరాలను గుర్తించి పథకాలను అమలు చేస్తుండటంతో రైతులు ధీమాగా బతుకుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి ఐదెకరాలకు ఒక ఏఈవోను నియమించడం వల్ల వ్యవసాయం లాభసాటిగా మారిందని తెలిపారు. కేసీఆర్ సీఎంగా ఉన్నన్ని రోజులు.. రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి కష్టాలు రావని అన్నారు.
కార్యక్రమాల్లో మోత్కూరు ఏఎంసీ ఛైర్పర్సన్ వనం స్వాతి, ఎంపీపీ తండ మంగమ్మ, జడ్పీటీసీ సభ్యుడు కొడిత్యాల నరేందర్ గుప్తా, సర్పంచులు ఎర్ర గీత, దయ్యాల రాజు సామ వరలక్ష్మి, ఎంపీటీసీ సభ్యులు ఎస్.మల్లారెడ్డి, ఎం.వెంకటేశం, ఎంపీడీవో ఎ.రాములు, ఏఈ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'సిద్దిపేట లేకపోతే కేసీఆర్ లేడు.. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు'