టెస్కాబ్ వైస్ ఛైర్మన్ గా గొంగిడి మహేందర్ రెడ్డి హైదారాబాద్లోని టెస్కాబ్ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. టెస్కాబ్ ఛైర్మెన్ కొండూరి రవీందర్ రావు, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, టెస్కాబ్ ఎండీ నేతి మురళీధర్ రావు, సీజీఎం జ్యోతి, గొంగిడి మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు, టీఆర్ఎస్ ఆలేరు నియోజకవర్గం ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో గత మూడు నెలల క్రితం బాధ్యతలు స్వీకరించాల్సి ఉండగా వాయిదా వేసుకుని నేడు స్వీకరించినట్లు గొంగిడి మహేందర్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ పాలనతోనే రైతులకు మంచి రోజులు వచ్చాయని.. 60 ఏళ్ల కాలంలో రాని వరి దిగుబడి ఈ ఏడాది వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు.
ఇవీ చూడండి: కరోనా నిర్ధారణ కోసమెళ్తే.. అంటుకునేలా చేస్తున్నారు!