ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారికి శయనోత్సవ ఊయలను హైదరాబాద్ సైనిక్ పురికి చెందిన పుట్టకోట జ్ఞానేశ్వర్ రావు దంపతులు బహుకరించారు. ఆలయ ఈఓ గీతారెడ్డి, ఛైర్మన్ నరసింహమూర్తికి ఊయలను అందజేశారు.
ఆలయ అర్చకులు ఊయలకు ప్రత్యేక పూజలు జరిపారు. ప్రత్యేకంగా తయారు చేసిన బంగారు తాపడం ఊయలపై స్వామివారి శంకు చక్ర తిరునామాలను అందంగా తీర్చిదిద్దారు. స్వామివారికి శయనోత్సవ సేవ కోసం ఈ ఊయలను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. బహుకరించిన దాతలు స్వామి వారి సుదర్శన నారసింహ హోమం పూజలో పాల్గొన్నారు. వారికి ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు చేసి.. స్వామివారి లడ్డూ ప్రసాదం అందచేశారు.
ఇదీ చూడండి: నెల్లికల్లులో రెవెన్యూ అధికారులపై తేనెటీగల దాడి