కరోనా బాధితులంటే కనీస మానవత్వం చూపించని కాలంలో.. వైరస్‌తో మృతి చెందిన ఓ వృద్ధుడికి పంచాయతీ సిబ్బంది ధైర్యంగా ముందుకొచ్చి అంత్యక్రియలు జరిపారు. యాదాద్రి జిల్లా గుండాల మండలంలో ఇది జరిగింది.
అంబాల గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు చింత పిచ్చయ్య(80) కొవిడ్ బారిన పడి మృతి చెందాడు. వైరస్ భయంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న పంచాయతీ సిబ్బంది.. పీపీఈ కిట్లు ధరించి మృతదేహాన్ని ఖననం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
ఇదీ చదవండి: 'ఎంజీఎంలో కరోనా రోగులకు ర్యాపిడ్ రెస్పాన్స్ బృందం'