ETV Bharat / state

రాష్ట్రంలో తొలి శిల్ప కళాశాల.. ఎక్కడుందో తెలుసా..? - Sculpture College in Yadadri

Yadadri Sculpture College : అంతరించిపోతున్న రాతి శిల్పకళను పునరుద్ధరించి.. రాబోయే తరాలకు సిద్ధహస్తులైన శిల్పకారులను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అబ్బురపరిచే శిల్పకళా రూపాలతో పునర్‌నిర్మితమైన యాదాద్రి పుణ్య క్షేత్రంలో.. డిగ్రీస్థాయిలో శిల్ప కళాశాలను ప్రారంభించింది. శిల్పకళలో విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నారు.

Yadadri institute sculpture and architecture

author img

By

Published : Dec 8, 2022, 12:47 PM IST

రాష్ట్రంలో తొలిసారిగా యాదాద్రిలో ఏర్పాటైన శిల్ప కళాశాల

Yadadri Sculpture College : సీఎం కేసీఆర్ ఆశయం మేరకు యాదాద్రిలో ఈనెల 4న శిల్ప కళాశాలను ప్రారంభించారు. ఇందులో మూడేళ్ల డిగ్రీ అందిస్తున్నారు. సంస్కృతి, సంప్రదాయాలను ముందు తరాలకు తెలియజేసేలా శిల్పకారులను తీర్చిదిద్డడమే ఈ కళాశాల లక్ష్యం. శిల్పకళలో సిద్ధహస్తులను తయారు చేసే వ్యవస్థ.. ఏపీలోని తిరుపతిలో తప్ప మరెక్కడా లేదు. మన రాష్ట్రంలోనూ అలాంటి వ్యవస్థ ఉండాలని సీఎం కేసీఆర్‌ సూచించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో వైటీడీఏ చర్యలు చేపట్టింది. శిల్పకళలో మూడేళ్ల డిగ్రీ అందించే డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశారు. శిల్ప కళాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద వహిస్తోంది. సిద్ధహస్తులైన శిల్పకారులను తయారు చేయడానికి తిరుమల స్థాయిలో సౌకర్యాలు కల్పించారు. ఏటా కోటి రూపాయల ఖర్చుతో కళాశాలను కొనసాగించనున్నారు. ఇందుకోసం దేవాదాయ శాఖ సీజీఎఫ్ నుంచి రూ.50 లక్షలు , యాదాద్రి దేవస్థానం నుంచి రూ.50 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో కళాభివృద్ధి కోసమే వైటీడీఏ నేతృత్వంలో ఈ శిల్ప కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

"వైటీడీఏ అభివృద్ధి పనుల్లో భాగంగా శిల్ప కళాశాల ఉంటే బాగుంటుదని వారు భావించారు. ఇక్కడ దేవస్థాన పనులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఇతర రాష్ట్రాల నుంచి శిల్పకారులు వచ్చి పనిచేస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణలో కూడా ఇలాంటి కళాశాల ఉంటే బాగుంటుందని భావించి మూడేళ్ల డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశారు." - మోతీలాల్, ఇంఛార్జ్ ప్రిన్సిపల్

శిల్పకళాశాల కోర్సును ఇక్కడ బాగా నేర్పిస్తున్నారు. మొత్తం 15 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ శిల్పాలు ఏ విధంగా చెక్కాలి అనేది నేర్పిస్తున్నారు. అదే విధంగా డ్రాయింగ్, శ్లోకాలు కూడా నేర్చుకుంటున్నాం. - విద్యార్థి, శిల్ప కళాశాల

ఇవీ చదవండి:

'ఇదేం పాపం.. ఇంజెక్షన్ ఇచ్చి వ్యభిచార కూపంలోకి దింపుతారా..?'

ఈనాడు 'అమృతగాథ' పుస్తకంపై ఝార్ఖండ్ సీఎం ప్రశంసలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.