ETV Bharat / state

బియ్యంలోడు లారీలో చెలరేగిన మంటలు.. పాక్షికంగా లారీ దగ్ధం - latest news of fire in rice load lorry

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు వద్ద బియ్యం లోడుతో జనగామ జిల్లా వైపు వెళ్తున్న లారీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి లారీ పాక్షికంగా దగ్ధమయ్యింది.

fire accident in rice load lorry at motkuru in yadadri bhuvanagiri
బియ్యంలోడుతో వెళ్తున్న లారీలో మంటలు.. పాక్షికంగా లారీ దగ్ధం
author img

By

Published : Jul 8, 2020, 2:24 PM IST

నల్గొండలోని ఓ రైస్​మిల్​ నుంచి జనగామ జిల్లా నెల్లుట్ల గ్రామంలోని మరో రైస్​మిల్​కు బియ్యం లోడుతో బయలుదేరిన లారీలో ప్రమాదవశాత్తు మంటలుచెలరేగాయి. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ వద్ద లారీ వెనుక చక్రాల నుంచి మంటలు చెలరేగాయని వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పారని లారీ డ్రైవర్​ తెలిపారు.

కాగా ఈ ఘటనలో లారీ పాక్షికంగా దగ్ధమైంది. అయితే లారీలో తరలిస్తున్న బియ్యం వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవీ చూడండి: ప్రైవేట్​లో వైద్యానికి నో చెప్పొద్దు.. ఫీజులెక్కువ అడగొద్దు: గవర్నర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.