యాదాద్రి జిల్లా మోత్కూరులో అదనపు కలెక్టర్ వాహనాన్ని కంది రైతులు అడ్డుకున్నారు. కందులు కొంటామని తహసీల్దార్ హామీ ఇచ్చినా.. అమలుకావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్లో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. తేమ శాతం తక్కువగా ఉందనే సాకుతో కందులు కొనేందుకు అధికారులు నిరాకరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనగా రాస్తారోకో చేశారు. అదే సమయంలో మున్సిపాలిటీ కేంద్రంలో పట్టణ ప్రగతి కార్యక్రమం అమలుతీరును పరిశీలించేందుకు వచ్చిన అదనపు కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్నారు. సమస్య పరిష్కరించే వరకు కదిలేది లేదంటూ భీష్మించుకొని కూర్చొన్నారు.
మార్క్ ఫెడ్ అధికారులతో మాట్లాడిన కలెక్టర్.. గన్ని సంచులు అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకున్నారు. శాంతించిన రైతులు ఆందోళన విరమించారు.