యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మున్సిపల్ కేంద్రంలో వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రోడ్డుపై రైతులు రాస్తారోకో నిర్వహించారు.
కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి నెలలు గడుస్తున్నా... అధికారులు కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరదలతో పంట పూర్తిగా నష్టయపోయామని.. మిగిలిన ధాన్యం కూడా ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే అప్పుల పాలై ఆత్మహత్య చేసుకోవడమే శరణ్యమని వాపోయారు. తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
- ఇదీ చదవండి : జీహెచ్ఎంసీ పోరులో వంద స్థానాలు సాధిస్తాం : కేటీఆర్