ETV Bharat / state

హైబ్రిడ్​ విత్తనాలతో మోసపోయామంటూ రైతుల ఆందోళన - విత్తనాలతో నష్టపోయామంటూ ధర్నా

వరి హైబ్రిడ్​ విత్తనాలతో మోసపోయామంటూ రైతులు ఆందోళన నిర్వహించారు. విత్తన కంపెనీపై చర్యలు తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు.

farmers dharna on paddy hybrid seeds at atmakur mandal in yadadri bhuvanagiri district
హైబ్రిడ్​ విత్తనాలతో మోసపోయామంటూ రైతుల ఆందోళన
author img

By

Published : Mar 22, 2021, 4:17 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై రైతన్నలు ధర్నా చేపట్టారు. వరి హైబ్రిడ్-799 విత్తనాలతో నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులైన కంపెనీపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.

అధిక దిగుబడులు వస్తాయని నమ్మి..

అధిక దిగుబడులు వస్తాయన్న ఆశతో రైతులు ఓ ప్రముఖ కంపెనీకి చెందిన హైబ్రిడ్ వరి వంగడాలను కొనుగోలు చేసి సాగు చేశామని తెలిపారు. తీరా పంట చూస్తే పంట చేతికొచ్చే సమయంలో వరి కంకి గింజలు లేక తాలుగా మారిందని వాపోయారు. దీనిపై వ్యవసాయ అధికారులను, విత్తనాలు, పురుగుమందుల దుకాణాల యాజమాన్యాలను ప్రశ్నిస్తే వాతావరణ మార్పులే కారణమని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

8 వేల ఎకరాల్లో సాగు చేశాం: రైతులు

ఈ విషయంపై తక్షణమే ప్రభుత్వం స్పందించి విత్తన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు నష్ట పరిహారం చెల్లించాలని.. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని బాధిత రైతులు హెచ్చరించారు. హైబ్రిడ్ వరి వంగడాలను ఆత్మకూరు మండలంలోనే సుమారుగా 8 వేల ఎకరాల్లో సాగు చేసినట్లు రైతులు తెలిపారు.

ఇదీ చూడండి: పెరగనున్న వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.