యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ ఆవరణలో దాతల సహకారంతో దాదాపు 300 మంది వలస కూలీలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. భువనగిరి జోన్ డీసీపీ నారాయణరెడ్డితో పాటు యాదగిరిగుట్ట ఏసీపీ, సీఐ, మున్సిపల్ కమిషనర్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొని సరుకులు అందజేశారు. అనంతరం యాదగిరిగుట్ట పురపాలిక కౌన్సిలర్లు, మండలంలోని సర్పంచ్‌లతో డీసీపీ సమావేశమయ్యారు. కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. గ్రామాల్లోకి కొత్త వ్యక్తులు వస్తే పోలీసులకు, ఆరోగ్య శాఖ వారికి సమాచారమివ్వాలని సూచించారు. ప్రజలు లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో 800 మార్కు దాటిన కరోనా కేసులు