యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను... ఈఎన్సీ రవీందర్ రావు మంగళవారం పరిశీలించారు. ఇటీవల క్షేత్ర సందర్శన చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్... సూచనల మేరకు పనులు చేపట్టాలన్నారు. ప్రధాన ఆలయం, శివాలయం, పుష్కరిణి, మొక్కల పెంపకం, ఫౌంటేన్ నిర్మాణం, బ్రహ్మోత్సవ, అష్టభుజి మండపాల వద్ద చేస్తున్న పనులు పరిశీలించారు.
వైకుంఠద్వారం వద్ద బండరాయి తొలగింపు, మెట్ల నిర్మాణం, రోడ్డు విస్తరణ, వలయ రహదారి పనులు, కొండ కింద ప్లై ఓవర్, రోడ్డు కొలతలకు సంబంధిన వివరాలు... అధికారులను అడిగి ఈఎన్సీ తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని గుత్తేదారులను ఆదేశించారు. వీరి వెంట వైస్ ఛైర్మన్ కిషన్ రావు, ఆలయ ఈవో గీతారెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ వసంత్ నాయక్, యాడా అధికారులు ఉన్నారు.
ఇదీ చూడండి: నేడు, రేపు రాష్ట్రంలో ఓ మోస్తారు వర్షాలు...!