![క్యూలైన్లో తడుస్తూనే](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-nlg-85-11-yadadri-bakthula-ikkatlu-av-ts10134_11072021142454_1107f_1625993694_886.jpg)
యాదాద్రి భువనగిరిజిల్లాలోని పలు మండలాల్లో ఉదయం నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. యాదగిరి గుట్ట, తుర్కపల్లి, బొమ్మలరామారం, మోటకొండూర్ మండలాల్లో ఉదయం 9గంటల నుంచి వర్షం పడుతోంది. యాదాద్రీశుని దర్శనానికొచ్చిన భక్తులు జోరువానతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆదివారం కావడం వల్ల పిల్లలతో కలిసి దర్శనానికొచ్చిన భక్తుల అవస్థలు వర్ణణాతీతం.
![జోరువానలో స్వామిదర్శనానికి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-nlg-85-11-yadadri-bakthula-ikkatlu-av-ts10134_11072021142454_1107f_1625993694_859.jpg)
కొండపై సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బంది పడ్డారు. కనీసం నిల్చోడానికి కూడా స్థలం లేకపోవడం వల్ల తడుస్తూనే స్వామివారిని దర్శంచుకున్నారు.
![తడిసి ముద్దైన యాదాద్రి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-nlg-85-11-yadadri-bakthula-ikkatlu-av-ts10134_11072021142454_1107f_1625993694_383.jpg)
స్వామివారిని దర్శించుకున్న జీహెచ్ఎంసీ మేయర్
![యాదాద్రీశుడి సన్నిధిలో జీహెచ్ఎంసీ మేయర్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12424277_yadadri4.jpg)
జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు మేయర్‌కు స్వాగతం పలికారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వదించగా... ఆలయ ఏఈవో శ్రవణ్ కుమార్... లడ్డూప్రసాదం అందించారు. అనంతరం కొండపై నిర్మాణంలో ఉన్న ఆయల పనులను పరిశీలించారు. మేయర్‌తో పాటు స్థానిక తెరాస నాయకులు ఉన్నారు.
![మేయర్‌కు లడ్డూ ప్రసాదం అందిస్తున్న ఆలయ ఏఈవో](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12424277_yadadri3.jpg)
ఇదీ చూడండి: Bonalu Festival : బోనాల పండుగ ఉత్సాహం.. నిబంధనల మధ్యే దర్శనం