ETV Bharat / state

హాజీపూర్​ కేసులో ముగిసిన డిఫెన్స్​ వాదనలు.. 17కు వాయిదా - Defense arguments concluded in Hajipur case

పోలీసులు సేకరించిన ఆధారాలకు చట్టబద్ధతే లేదంటూ హాజీపూర్ కేసులపై డిఫెన్స్ న్యాయవాది సాగించిన వాదనలు... ఈ నెల 17న సైతం కొనసాగనున్నాయి. అప్పటివరకు కేసు విచారణను వాయిదా వేస్తూ... నల్గొండలోని పోక్సో చట్టం కోర్టు ఆదేశాలిచ్చింది. ప్రాసిక్యూషన్ పేర్కొన్న అంశాల్లో చాలా అనుమానాలున్నాయని... డిఫెన్స్ న్యాయవాది కోర్టుకు వివరించారు.

defense-arguments-concluded-in-hajipur-case

author img

By

Published : Jan 9, 2020, 6:14 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ హత్య కేసు విచారణలో... ప్రాసిక్యూషన్ వాదనల్లోని అంశాలపై డిఫెన్స్ న్యాయవాది పలు అభ్యంతరాల్ని లేవనెత్తారు. నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డికి స్మార్ట్ ఫోన్లు లేకున్నా ఉన్నట్లు పోలీసు నివేదికల్లో కట్టుకథ అల్లారని... ఫోరెన్సిక్, డీఎన్ఏ నివేదికలంటూ తప్పుదోవ పట్టిస్తున్నారని డిఫెన్స్ న్యాయవాది ఎస్.రవీంద్ర ఠాగూర్... కోర్టుకు తెలియజేశారు. ఫోన్లు లేకున్నా సిమ్ కార్డులు ఎవరి పేరునైనా తీసుకునే అవకాశముంటుందని... నల్గొండలోని మొదటి అదనపు సెషన్స్ న్యాయస్థాన పోక్సో చట్టం కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

ముగిసిన డిఫెన్స్​ వాదనలు

గతేడాది ఏప్రిల్ 25న అదృశ్యమైన బాలిక కేసులో... నిందితుడి తరఫున వాదనలు కొనసాగించారు. సోమ, మంగళవారాల్లో ప్రాసిక్యూషన్ వాదనలు పూర్తి కాగా... బుధవారం నాడు ఒక కేసులో మాత్రమే డిఫెన్స్ వాదనలు ముగిశాయి. 2017లో జరిగిన కర్నూలు హత్య కేసులో శ్రీనివాస్ రెడ్డి హస్తముందంటూ కేసు నమోదైందని పేర్కొన్న ప్రాసిక్యూషన్... ఆ ఘటనకు సంబంధించి 2016లో సాక్ష్యం ఎలా సేకరించారో సోదాహరణంగా తెలియజేయాలన్నారు. అంటే హత్య జరగడానికి ముందే ఆ ఘటన జరుగుతుందని ఏమైనా చెప్పారా అంటూ... డిఫెన్స్ న్యాయవాది ప్రశ్నలు వేశారు.

ఆధారాలు లేవన్న డిఫెన్స్ న్యాయవాది

శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులెవరూ రోజంతా హాజీపూర్లోని ఇంట్లో ఉండేవారు కాదని... పనుల కోసం వలస వెళ్లిన సమయంలో సిమ్ కార్డులు దొంగిలించి వాటి ద్వారా అసాంఘిక కార్యకలాపాలు జరిపి ఉండొచ్చన్న వాదనను తెరపైకి తెచ్చారు. ఒక బాలికను వివస్త్రను చేసి అత్యాచారం చేసిన తర్వాత దుస్తులు వేసి బావిలో మట్టి పోశారంటూ పోలీసులు వాంగ్మూలాలు సేకరించారని... అయినా ఆ దుస్తులపై మరకలు ఉన్నాయన్న సాక్ష్యాధారాలను తప్పుబట్టారు. ఈ కేసుల్లో ఆటోడ్రైవర్ ప్రమేయం ఉండొచ్చని... కానీ ఆయనను కేసులోకి ఎందుకు తీసుకురాలేకపోయారన్న వాదనను తెరపైకి తెచ్చారు.

స్పష్టమైన ఆధారాలు ఉన్నాయన్న ప్రాసిక్యూషన్​

డిఫెన్స్ న్యాయవాది లేవనెత్తిన అంశాలను... ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది పి.చంద్రశేఖర్ కొట్టిపారేశారు. తమ వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయని... పోలీసులు సేకరించిన సాక్ష్యాలపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని స్పష్టం చేశారు. స్మార్ట్ ఫోన్లలో సామాజిక మాధ్యమాన్ని నిందితుడే వినియోగించాడని... అందుకు సంబంధించిన వివరాల్ని ఆయా మొబైల్ ఆపరేటర్ల ద్వారా సేకరించామని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు ఎదుట పేర్కొన్నారు.

ఈనెల 17కు వాయిదా

గతేడాది మార్చి 9న కనిపించకుండా పోయిన బాలిక కేసుతోపాటు 2015 ఏప్రిల్లో అదృశ్యమైన విద్యార్థిని హత్యోదంతంలోనూ డిఫెన్స్ వాదనలు సాగనున్నాయి. ఇందుకోసం ఈ నెల 17కు కేసును న్యాయమూర్తి వాయిదా వేశారు. డిఫెన్స్ న్యాయవాదితోపాటు ప్రాసిక్యూషన్ వాదనలు సైతం... ఈ నెల 17న కొనసాగనున్నాయి. ఇరుపక్షాల వాదనలు పూర్తయిన తర్వాత... కేసుపై తీర్పు వెలువడే అవకాశముంది.

హాజీపూర్​ కేసులో ముగిసిన డిఫెన్స్​ వాదనలు.. 17కు వాయిదా

ఇవీచూడండి: పురపోరుకు ములుగు ఎందుకు దూరమైంది..?

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.