యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈదురుగాలులతో కురిసిన వడగండ్ల వానకు తొమ్మిది మండలాల్లో భారీగా వరి పంట నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా 2,968 ఎకరాల్లో వరిపంటకు నష్టం సంభవించినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ వెల్లడించారు.
వలిగొండ మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన పంటనష్టాన్ని స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పరిశీలించారు. పంట నష్టం గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. కోతకొచ్చిన వరిపంట నీట మునగడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. వారందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: తెలంగాణలో 471కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు