యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని పాత పోలిస్‌స్టేషన్ ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ నిర్మాణ పనుల్ని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పరిశీలించారు. పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హరితహారంలో భాగంగా అక్కడ మొక్కలు నాటారు. సీపీ వెంట భువనగిరి జోన్ డీసీపీ నారాయణ రెడ్డి, పట్టణ పోలీస్ అధికారులు, ట్రాఫిక్ పోలీస్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇవీ చూడండి: వ్యవసాయ శాఖ క్రియాశీలకంగా మారాలి: సీఎం