ETV Bharat / state

పొడిచేడులో పెరుగుతున్న కరోనా కేసులు.. అప్రమత్తమైన అధికారులు - యాదాద్రి భువనగిరిజిల్లా తాజా వార్త

యాదాద్రి భువనగిరి జిల్లా పొడిచేడు గ్రామంలో రోజురోజు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. దీనితో అప్రమత్తమైన గ్రామపంచాయతీ అధికారులు, సర్పంచ్​ వైరస్​ కట్టడికై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కరోనా బాధిత ప్రాంతాల్లో రసాయన ద్రావణాన్ని పిచికారీ చేయడం.. ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు.

corona precautions in podichedu village in yadadri bhuvanagiri district
పొడిచేడులో పెరుగుతున్న కరోనా కేసులు.. అప్రమత్తమైన అధికారులు
author img

By

Published : Sep 8, 2020, 9:29 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలో గత కొద్దిరోజులుగా పాజిటివ్ కేసులు అధికంగా నమోదు కావడం వల్ల అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కొవిడ్​ను కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా గ్రామ సర్పంచ్ పేలపూడి మధు మోత్కూరు... తహసీల్దార్ షేక్ అహ్మద్​తో కలసి గ్రామంలో కరోనా బాధితులు ఉన్న వీధులను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించి బారికేట్లు అమర్చారు. ప్రతి వీధిలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావకం పిచికారి చేయించారు. కంటైన్మెంట్ జోన్​లో ఉన్న కుటుబాలకు నిత్యావసర సరకులు గ్రామ పంచాయతీ నుంచి సమకూర్చనున్నట్లు తెలిపారు.

కరోనా కట్టడికి తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని, మాస్కులు ధరించాలని సూచించారు. అందుకు గ్రామ పంచాయతీ, బస్సు స్టాండ్ వద్ద శానిటేజర్లు, మాస్కులు అందుబాటులో ఉంచనున్నట్లు సర్పంచ్ మధు తెలిపారు. ఇప్పటి వరకు గ్రామంలో 350 కరోనా ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా అందులో 70 మందికి వైరస్​ నిర్ధారణ అయ్యిందని పేర్కొన్నారు. ప్రజలెవరూ భయపడాల్సి పనిలేదని కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఇదీ చూడండి: పీవీ గ్లోబల్ ఇండియా రూపశిల్పి.. : కేసీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.