యాదాద్రి పుణ్యక్షేత్రాభివృద్ధిలో భాగంగా.. కొండ చుట్టూ ప్రదక్షిణలు చేసే భక్తుల కోసం ప్రత్యేక రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
రాయగిరి నుంచి..
కొండపై పనులన్నింటినీ ఏక కాలంలో పూర్తి చేసే క్రమంలో దిగువన కొండ పక్క నుంచే సదరు దారి ఏర్పాటు కానుంది. రాయగిరి నుంచి గుట్ట వరకు 4 వరుసల రహదారి నిర్మించిన గుత్తేదారులే గిరిప్రదక్షిణ బాట పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. 13 అడుగుల వెడల్పులో కొండ చుట్టూ నిర్మితమయ్యే దారిలో అవసరమైన చోట్ల మెట్లను నిర్మించనున్నట్లు వివరించారు.
పాత పంప్ హౌస్ నుంచి..
క్షేత్ర సన్నిధిలో గిరి ప్రదక్షిణ చేపట్టే భక్తులకు కోసం.. కొండ కింద పాత పంప్ హౌస్ నుంచి రెంవవ ఘాట్ రోడ్డు వరకు గిరి నిర్మాణ పనులు 3 రోజులగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని చదును చేసి ప్లేయిన్ కాంక్రీట్ సిమెంట్ పనులు జరుపుతున్నట్లు క్రాంట్రాక్టర్లు తెలిపారు. వాటిపై ఇటుకలతో మెట్ల నిర్మాణం చేసి కిలోమీటర్ వరకు పక్కన గ్రీనరి ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: ఐఐటీ వదిలి.. జనహితం కోరి..