వంట గ్యాస్ సిలిండర్ పైన 100 రూపాయలు పెంచి సామాన్య ప్రజలపైన భారం మోపుతున్నారని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బీసుకుంట్ల సత్యనారాయణ విమర్శించారు. కేంద్ర ప్రభత్వం వెంటనే గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని వెల్లడించారు. సామాన్య ప్రజల బాధ వారికి అర్థమవడం లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు వారికి బుద్ది చెప్పి కాంగ్రెస్‌ని అధికారంలోకి తీసుకువస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో అధికారికి వినతిపత్రం సమర్పించారు.