ETV Bharat / offbeat

సండే స్పెషల్ - ఘుమఘుమలాడే "మటన్ పులావ్" - నిమిషాల్లో సింపుల్​గా ప్రిపేర్​ చేసుకోండిలా! - MUTTON PULAO RECIPE

నోరూరించే "వైట్ మటన్ పులావ్" ఈజీగా చేసేయండిలా - ఒక్కసారి రుచి చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

HOW TO MAKE MUTTON PULAO
Mutton Pulao Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 24, 2024, 11:04 AM IST

Mutton Pulao Recipe in Telugu : పులావ్.. ఈ పేరు వింటే చాలు ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది కదూ. ఇక అందులోనూ చికెన్, మటన్ పులావ్ అంటే నోట్లో నీళ్లూరతాయి. అయితే, ఎక్కువ మంది మటన్ పులావ్ వండాలంటే కాస్త శ్రమతో కూడుకుందని, టైమ్ ఎక్కువ పడుతుందని అనుకుంటుంటారు. అందుకే చాలా మంది మటన్​తో రెసిపీలను చాలా తక్కువగా ప్రిపేర్ చేసుకుంటుంటారు. కానీ, ఇప్పుడు చెప్పబోయే ప్రాసెస్​లో చికెన్ పులావ్ కంటే ఈజీగా కుక్కర్లో మటన్ పులావ్​ని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అద్దిరిపోతుంది! మరి, అందుకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • మటన్ - 1 కేజీ
  • ఉప్పు - రుచికి సరిపడా
  • జీలకర్ర - 1 టీస్పూన్
  • సోంపూ - 1 టీస్పూన్
  • ధనియాలు -1 టీస్పూన్
  • సుగంధ ద్రవ్యాలు - కొన్ని
  • బాస్మతి రైస్ - 1 కేజీ
  • వెల్లుల్లి పాయలు - 3
  • ఉల్లిపాయలు - 4
  • నూనె - తగినంత
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్​స్పూన్లు
  • టమాటాలు - 2
  • పచ్చిమిర్చి - 7
  • పెరుగు - 150 గ్రాములు
  • గరం మసాలా పౌడర్ - 1 టీస్పూన్
  • మిరియాల పొడి - 1 టీస్పూన్
  • క్రీమ్ - 2 టేబుల్​స్పూన్లు

సండే స్పెషల్​ - టేస్టీ "రాజుగారి కోడి పులావ్​" - ఇలా చేస్తే ఆహా అనాల్సిందే!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా బాస్మతి రైస్​ని శుభ్రంగా కడిగి అరగంటపాటు నానబెట్టుకోవాలి.
  • అనంతరం మటన్​ను శుభ్రంగా కడిగి ప్రెషర్ కుక్కర్​లోకి తీసుకోవాలి. ఆపై అందులో ఉప్పు, జీలకర్ర, ధనియాలు, సోంపూ, సుగంధ ద్రవ్యాలు(లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క వంటివి), కొద్దిగా ఆయిల్, లీటర్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి.
  • అలాగే సన్నగా తరుకున్న ఒక ఉల్లిపాయ తరుగు, శుభ్రంగా ఉన్న మూడు వెల్లుల్లిని పాయలతో సహా వేసుకొని కలిపి మూతపెట్టి నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
  • ఆలోపు రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, టమాటాలను తరుక్కొని రెడీగా పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై మందపాటి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక ఉల్లిపాయ తరుగు వేసుకొని బ్రౌన్ కలర్​లోకి మారేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఆపై అదే పాన్​లో పులావ్​లోకి కావాల్సిన కొన్ని సుగంధద్రవ్యాలు, కుక్కర్​లో ఉడికించుకున్న మటన్​, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసుకొని హై ఫ్లేమ్ మీద 3 నుంచి 4 నిమిషాల పాటు షాలో ఫ్రై చేసుకోవాలి.
  • ఆవిధంగా ఫ్రై చేసుకున్నాక అందులో ముందుగా వేయించుకున్న కొన్ని ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కలిపి మరికాసేపు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత పెరుగు యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు మిశ్రమాన్ని ఫ్రై చేసుకోవాలి.
  • అనంతరం ముందుగా మటన్ ఉడికించున్న వాటర్​ని వడకట్టి నాలుగు కప్పుల వరకు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఆపై గరం మసాలా పౌడర్, మిరియాల పొడి, క్రీమ్ వేసుకొని కలిపి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కాసేపు అలా సన్నని మంట మీద ఉడికించాలి.

ఆహా అనిపించే ​"ఆఫ్ఘాని ఎగ్​ మసాలా"- సూపర్​ టేస్టీ రెసిపీ - ఇంట్లో ఈజీగా చేసేయండి!

  • ఆ తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్​ని వడకట్టి వేసుకొని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఆపై హై ఫ్లేమ్ మీద 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆపై మూత తీసి కొద్దిగా కొత్తిమీర, పుదీనా తరుగు వేసుకొని కలిపి మీడియం ఫ్లేమ్ మీద మరో 3 నిమిషాల పాటు ఉడికించాలి.
  • అనంతరం మరోసారి మూత తీసి ఒకసారి నెమ్మదిగా కింద నుంచి కలిపి ఆవిరి పోకుండా పాన్​ని సిల్వర్ ఫాయిల్​తో మూసి దమ్ పెట్టుకోవాలి. అంటే.. లో ఫ్లేమ్ మీద 10 నుంచి 12 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
  • ఆ తర్వాత మూతతీసి వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్​తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "మటన్ పులావ్" రెడీ!
  • మరి, ఇంకెందుకు ఆలస్యం నచ్చితే మీరూ ఈ సండే ఓసారి ట్రై చేసి చూడండి. సండే విందు అద్దిరిపోతుంది. ఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టంగా తింటారు!

ముక్క మెత్తగా ఉండే సూపర్​ టేస్టీ "మటన్​ ఫ్రై" - ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా లాగిస్తారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.