కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలోని వినాయక చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికే సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని మరింత ప్రమాదంలోకి నెట్టేలా కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేసిందని.. వెంటనే రైతు వ్యతిరేక బిల్లులు వెనక్కి తీసుకోకపోతే.. భారీ ఉద్యమాన్ని చేపడుతామని యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.
చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ధర్నా నేపథ్యంలో పట్టణంలో కొద్దిసేపు ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడింది. బడా కంపెనీలకు మేలు చేసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లులు తీసుకొచ్చిందని.. కాంగ్రెస్ పార్టీ రైతులకు, పేదలకు తోడుగా వారి కోసం పోరాటాలు చేస్తుందని ఆయన అన్నారు. పేద ప్రజలకు భారంగా మారనున్న ఎల్ఆర్ఎస్ను కూడా వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: కుమార్తె ప్రేమ పెళ్లి.. పరువు కోసం అల్లుడి హత్య