కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను వెనక్కి తీసుకోవాలని, సన్నరకం ధాన్యాన్ని రూ.2500కు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతుదీక్ష నిర్వహించారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు ఎకరాకు 20వేల రూపాయల పరిహారం చెల్లించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో జేసీ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
కేంద్రం వ్యవసాయ బిల్లుల పేరుతో రైతులను నష్టానికి గురిచేస్తోందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆయన విమర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోవడానికి రెండు నెలల సమయం పడుతోందని ఆయన ఆరోపించారు. రైతులకు అండగా ఉండి, రైతుల పక్షాన పోరాడుతామన్నారు.
ఇవీ చూడండి: ఉద్రిక్తతకు దారితీసిన కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడి