ETV Bharat / state

'బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాటం'

యాదాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న బాధితులకు నష్టపరిహారం చెల్లించాలంటూ ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు బీర్ల అయిలయ్య డిమాండ్​ చేశారు. రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామని చెప్పిన కేసీఆర్ హామీని​ మర్చిపోయారని విమర్శించారు. బాధితులకు న్యాయం జరిగే వ​రకు పెద్దఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.

congress leaders  deeksha  in yadagirigutta to give  Compensation to the people who loss the houses in road works
రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న కాంగ్రెస్​ నాయకులు
author img

By

Published : Jan 16, 2021, 7:01 PM IST

Updated : Jan 16, 2021, 7:43 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రిలో చేపడుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న ప్రజలను ఆదుకోవాలని ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్​ నాయకుడు బీర్ల అయిలయ్య డిమాండ్​ చేశారు. వారికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని యాదగిరిగుట్టలో రిలే నిరాహార దీక్షలను ఆయన ప్రారంభించారు. బాధితులకు తగిన నష్టపరిహారం చెల్లించకపోతే పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామన్నారు.

ఈ విషయంలో సీఎం మాట తప్పారని ఆయన మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి బాధితులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్​ చేశారు. నష్టపరిహారం అందించాకే రోడ్ల విస్తరణ చేపట్టాలన్నారు. లేనిపక్షంలో కాంగ్రెస్ తరపున పెద్దఎత్తున రిలే నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం, పట్టణ అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్ గౌడ్, నియోజకవర్గ మహిళా ఇన్​ఛార్జ్​ గుడ్ల వరలక్ష్మి పాల్గొన్నారు.

ఇదీ చూడండి : కొవిడ్ టీకా.. దశలవారీగా అందరికీ వేస్తాం: మంత్రి సబిత

Last Updated : Jan 16, 2021, 7:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.