యాదాద్రి జిల్లా భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తెరాస నేతలు డబ్బులు పంచుతున్నారంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. అనంతరం పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
డబ్బులు పంపిణీ చేస్తున్నారని తాము నిలదీస్తే తమపై పోలీసులు అక్రమంగా లాఠీఛార్జ్ చేసి అరెస్ట్ చేశారని కాంగ్రెస్ నాయకుడు ప్రమోద్ కుమార్ ఆరోపించారు. తెరాస నాయకులను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి పంపేయటంతో వివాదం సద్దుమణిగింది.
ఇదీ చూడండి: నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎన్నికలకు పూర్తైన ఏర్పాట్లు