యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయ పునర్మిర్మాణ పనులను సీఎంవో భూపాల్ రెడ్డి తనిఖీ చేశారు. ప్రధానాలయంలో నిర్మాణ పనుల ఆలస్యం కావడంపై వైటీడీఏ అధికారులపై మండిపడ్డారు. దాదాపు గంటసేపు రాజగోపురాలను, మాడవీధులను పరిశీలించారు. కృష్ణశిలతో చేసిన ఫ్లోరింగ్‌ను శుద్ధి చేయాలని అధికారులకు సూచించారు. ప్రధానాలయం వద్ద చేపడుతున్న రథశాల, లిఫ్టు, క్యూలైన్ పనులను వేగవంతం చేయాలని కోరారు.
పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని.. ఆలయ పరిసరాలు శుభ్రంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్షేత్ర సందర్శనకు త్వరలో సీఎం రానున్న సందర్భంగా నిర్మాణ పనులు ముమ్మరం చేయాలన్నారు. అంతకుముందు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండపైన హరిత టూరిజంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం జరిపారు. ఈ సమావేశంలో వైటీడీఏ వైస్ ఛైర్మన్ కిషన్ రావు, ఆర్కిటెక్చర్ ఆనందసాయి, చీఫ్ ఇంజనీర్ గణపతిరెడ్డి, ఈవో గీతారెడ్డి, ఆలయ స్థపతి ఆనందచారి వేలు, ఎస్ఈ వసంత నాయక్, డీఈలు, ఈఈ, వైటీడీఏ అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : పీఆర్‌సీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతల ఆందోళన