యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో జాతీయ హరిత ట్రైబ్యునల్ ఉత్తర్వులకు సంబంధించిన అంశాలపై కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖకు నివేదిక పంపాలని జెన్కో నిర్ణయించింది. ఈ మేరకు జెన్కో డైరెక్టర్లతో హైదరాబాద్‌లో సమావేశమైన సీఎండీ ప్రభాకర్ రావు.. యాదాద్రి పవర్ ప్లాంటుకు సంబంధించి ఎన్జీటీ ఇచ్చిన ఉత్తర్వులపై సమీక్షించారు. ఎన్జీటీ ప్రస్తావించిన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ సరిహద్దు, యాష్ పాండ్ డిజైన్, రేడియో ఆక్టివిటీ ప్రభావం అంశాలను ఇప్పటికే నిబంధనలు పాటించినట్లు సీఎండీ తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్‌కు అనుగుణంగా పర్యావరణ అనుమతులకు దరఖాస్తు చేసిన సమయంలోనే ప్లాంటుకు పది కిలోమీటర్ల మేర విస్తీర్ణంలో యాంబియెంట్ ఎయిర్ క్వాలిటీ మోడలింగ్ పూర్తి చేసినట్లు వివరించారు. ఎన్జీటీ నిర్ధేశాలకు అనుగుణంగా 25 కిలోమీటర్ల మేర విస్తీర్ణంలో పరిసర వాయు నాణ్యత మోడలింగ్, క్యుములేటివ్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ నిర్వహిస్తామని సీఎండీ చెప్పారు. ఎన్జీటీ ఆదేశాలను పాటిస్తూ సవరించిన షెడ్యూల్ ప్రకారం ప్రాజెక్టు ప్రారంభించేందుకు ప్రయత్నిస్తామని ప్రభాకర్ రావు తెలిపారు.
ఇవీ చదవండి: