రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా... స్థలాలు, ఇళ్లు కోల్పోతున్న వారిని ఆదుకుంటామని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఆలయం, రోడ్డు విస్తరణలో స్థలం, దుకాణాలు, ఇల్లు కోల్పోయిన వారికి తగిన పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు.
కోల్పోయిన దానికంటే గొప్పగా ఉండేలా... షోరూముల తరహాలో కొత్త దుకాణాలు నిర్మించి ఇస్తామన్నారు. గతంలో గుట్ట మీద వ్యాపారం చేసుకున్న వారికి టెంపుల్ టౌన్‌లో దుకాణాలిస్తామన్నారు. ఆలయంలో స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలన్న అంశాన్ని పరిశీలిస్తామని సీఎం తెలిపారు.