ETV Bharat / state

యాదాద్రి సన్నిధిలో జాతీయ నేతలు.. కేసీఆర్​తో కలిసి ప్రత్యేక పూజలు

National Leaders at Yadadri temple : ముఖ్యమంత్రి కేసీఆర్​ సహా జాతీయ నేతలు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. సీఎం కేసీఆర్​తో పాటు కేజ్రీవాల్, భగవంత్​మాన్​సింగ్​, అఖిలేశ్​ యాదవ్​, డి.రాజా ఇతర నేతలు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అధికారులు.. నేతలకు స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. అంతకుముందు ప్రగతిభవన్​లో ఏర్పాటు చేసిన విందులో అతిథులు పాల్గొన్నారు.

యాదాద్రిని దర్శించుకున్న జాతీయ నేతలు
యాదాద్రిని దర్శించుకున్న జాతీయ నేతలు
author img

By

Published : Jan 18, 2023, 12:16 PM IST

Updated : Jan 18, 2023, 2:20 PM IST

యాదాద్రి సన్నిధిలో జాతీయ నేతలు

National Leaders at Yadadri temple : దేశం దృష్టిని తన వైపు తిప్పుకునేలా జరుగుతున్న బీఆర్​ఎస్​ ఆవిర్భావ సభకు పలువురు జాతీయ నేతలు హాజరవుతున్నారు. దిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు.. కేజ్రీవాల్, భగవంత్​మాన్‌ సింగ్​, పినరయి విజయన్ సహా యూపీ మాజీ సీఎం అఖిలేశ్​యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజాతో పాటు పలువురు జాతీయ నేతలు బీఆర్​ఎస్ ఆవిర్భావ సభకు హాజరవుతున్నారు.

ప్రగతిభవన్​లో సీఎం కేసీఆర్​తో జాతీయ నేతలు

Khammam BRS Public Meeting : ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రే హైదరాబాద్‌కు విచ్చేసిన వీరంతా.. ఉదయం ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన అల్పాహార విందులో విశిష్ట అతిథులు పాల్గొన్నారు. విందు సమయంలో జాతీయ రాజకీయాలు, సంబంధిత అంశాలపై ఈ నేతలు చర్చించారు. విందు అనంతరం.. బేగంపేట నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్‌లలో ముఖ్యమంత్రులు, ఇతర నేతలు యాదాద్రికి వెళ్లారు.

యాదగిరిగుట్టలో హెలిపాడ్ నుంచి నేతలంతా తొలుత ప్రెసిడెన్షియల్ సూట్‌కు చేరుకున్నారు. కేరళ సీఎం విజయన్‌, సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా అతిథి గృహంలోనే ఉండిపోగా.. మిగతా వారంతా స్వామివారి దర్శనానికి వెళ్లారు. లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రులు, అగ్ర నేతలకు ఆలయ త్రితల రాజగోపురం వద్ద అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. నేతలంతా ఆంజనేయ స్వామి సన్నిధి వద్ద హారతి తీసుకున్నారు. మూల విరాట్ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు, వేద పండితులు సంకల్పం, సువర్ణ పుష్పాలతో అర్చన నిర్వహించి.. హారతి, తీర్థ ప్రసాదాలతో పాటు మంత్రోచ్ఛారణలతో వేద ఆశీర్వచనం అందించారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫొటోఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రులు, అగ్ర నేతలు తిలకించారు. ఆలయ ప్రాశస్త్యం, ఆధునీకరించిన విధానం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇతర సీఎంలు, నేతలకు వివరించారు. యాదాద్రి పర్యటన ముగించుకున్న ముఖ్యమంత్రులు, నేతలు ప్రత్యేక హెలికాప్టర్లలో ఖమ్మం బయలుదేరారు.

భారీ మెనూ సిద్ధం..: యాదాద్రి పర్యటన అనంతరం నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు హెలికాప్టర్‌లలో ఖమ్మం బయలుదేరి వెళ్లారు. అక్కడ నూతన సమీకృత కలెక్టరేట్‌ ప్రారంభోత్సవం అనంతరం, కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం కలెక్టరేట్‌లోనే భోజనం చేయనున్నారు. అతిథుల భోజనం కోసం భారీ మెనూ సిద్ధం చేశారు. 17 రకాల మాంసాహార, 21 రకాల శాకాహార వంటలతో భోజనాలు ఏర్పాటు చేశారు.

ఇవీ చూడండి..

ఖమ్మం నగరం గులాబీ మయం.. బీఆర్ఎస్​ తొలి సభకు సర్వం సిద్ధం

BRS సభకు తరలివస్తోన్న జాతీయనేతలు.. హైదరాబాద్‌కు దిల్లీ, పంజాబ్‌, కేరళ సీఎంలు, డీ రాజా

Last Updated : Jan 18, 2023, 2:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.