ETV Bharat / state

కార్మికులను ఆదుకోవాలంటూ ఆందోళన - citu protest at thurkapalli

లాక్​డౌన్​ కారణంగా ఇబ్బందులు పడుతున్న కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్​ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.

citu protest at thurkapalli in yadadri district
కార్మికులను ఆదుకోవాలంటూ ఆందోళన
author img

By

Published : May 9, 2020, 5:09 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. లాక్​డౌన్​ నేపథ్యంలో హమాలీ, నిర్మాణ, పారిశుద్ధ్య, ఆటో కార్మికులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్​ చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో చిక్కుకున్న వలస కార్మికులను ప్రభుత్వ ఖర్చులతో సొంత ప్రాంతాలకు తరలించాలన్నారు. కరోనా కాలంలో సేవలందిస్తున్న ఆశావర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులర్​ చేయాలని డిమాండ్​ చేశారు. లాక్​డౌన్​ వల్ల ఇబ్బందులు పడుతోన్న ఆటో కార్మికుల కుటుంబాలకు రూ. 7500 ఆర్థిక సహాయం అందించాలని.. 3 నెలల పాటు ఉచిత సరుకులు పంపిణీ చేయాలని డిమాండ్​ చేశారు. హమాలీ కార్మికులందరికీ వర్తించేలా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు.

ఇదీ చూడండి:'మన జీవన విధానం ద్వారానే కరోనాను అడ్డుకోవచ్చు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.