యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపూర్ రిజర్వాయర్ని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మిత సబర్వాల్ సందర్శించారు. పనుల పురోగతి గురించి ప్రాజెక్టు అధికారులని అడిగి తెలుసుకున్నారు. జూన్-జులై వరకు పనులు పూర్తి చేసి 1.5 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రిజర్వాయర్ కట్ట, కాల్వ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను స్మిత సబర్వాల్ నిర్ధేశించారు. అనంతరం బస్వాపురం క్యాంప్ కార్యాలయంలో ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్షించారు. బస్వాపురం, వడపర్తి, తిమ్మాపూర్ భూసేకరణ పూర్తి చేసి, వెంటనే నిధుల విడుదలకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆమె వెంట కలెక్టర్ అనిత రామచంద్రన్, అదనపు కలెక్టర్ రమేష్ ఉన్నారు.
ఇవీ చూడండి:స్వదేశానికి విద్యార్థులు.. ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు