ETV Bharat / state

'పల్లాను ఎమ్మెల్సీగా పంపితే ఏనాడు మాట్లాడలే'

పట్టభద్రులు పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఎమ్మెల్సీగా ఎన్నుకుంటే ఏనాడు నిరుద్యోగ సమస్యలపై మాట్లాడలేదని చెరుకు సుధాకర్ ఆరోపించారు.

author img

By

Published : Oct 11, 2020, 9:49 AM IST

'పల్లాను ఎమ్మెల్సీగా పంపితే ఏనాడు మాట్లాడలే'
'పల్లాను ఎమ్మెల్సీగా పంపితే ఏనాడు మాట్లాడలే'

ముఖ్యమంత్రి కేసీఆర్.. అభివృద్ధి పేరిట రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి చెరుకు సుధాకర్. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కురు మున్సిపాలిటీ కేంద్రంలో ఆయన మీడిమా సమావేశం ఏర్పాటు చేశారు.

రాష్ట్రంలో ఏ యూనివర్సిటీలో కూడా ఒక్క పోస్ట్ కూడ భర్తీ చేయలేదన్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల దుస్థితి ఈ విధంగా ఉంటే వీటికి పునర్ వైభవం తీసుకరాకుండా పల్లా రాజేశ్వర్ రెడ్డికి మాత్రం ప్రైవేట్ యూనివర్సిటీకి అనుమతి ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు.

పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఎమ్మెల్సీగా పంపితే ఏనాడు పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదన్నారు. నిరుద్యోగులను ముంచిన మీకు ఓటు అడిగే నైతిక అర్హత లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటి పార్టీ జిల్లా అధ్యక్షులు యానాల నర్సింహ్మ రెడ్డి, బైరి శేఖర్, బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, గ్రాడ్యుయేట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు పోతుగంటి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: గ్రామాల్లో అపోహలు వద్దు.. మీ ఆస్తులు నమోదు చేసుకోండి: మంత్రి ఎర్రబెల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.