ETV Bharat / state

యాదాద్రి సప్తరాజ గోపురాలకు ఇత్తడి గ్రిల్స్ - యాదాద్రి ఆలయం పునర్నిర్మాణం

యాదాద్రిని మహా దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయంలో పలు ఇత్తడి నిర్మాణాలను యాడ చేపడుతోంది. రాజగోపురాల్లో కిటికీలు, ప్రాకారాలు చుట్టూ ఇత్తడి గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నారు. గాలిగోపురాల్లోకి కోతులు, పక్షులు, వెళ్లకుండా ఇత్తడి కిటికీలు, అద్దాలు బిగిస్తున్నారు. ఆలయ మాడవీధుల్లో ఇత్తడి గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులు తుదిదశకు చేరుకున్నాయి.

yadadri
yadadri
author img

By

Published : Jul 10, 2020, 8:11 PM IST

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా పలు ఇత్తడి నిర్మాణాలు యాడ చేపడుతోంది. ప్రధాన ఆలయం చుట్టూ ఉన్న సప్తరాజ గోపురాలకు ఇత్తడితో తయారుచేసే కిటికీలు అమర్చుతున్నారు. గాలిగోపురాల్లోకి కోతులు, పక్షులు, వెళ్లకుండా ఇత్తడి కిటికీలు, అద్దాలు బిగిస్తున్నారు. క్యూలైన్ టెండర్‌లో భాగంగా కిటికీలను శ్రీకాళహస్తి నుంచి వచ్చిన కళాకారులు స్థానికంగా తయారు చేశారు. తొలుత ఐదంతస్తుల తూర్పు రాజ గోపురానికి కిటికీలు బిగించారు.

yadadri
సప్తరాజ గోపురాలకు ఇత్తడి గిల్స్

తుది దశకు

ఆలయ మాడవీధుల్లో ఇత్తడి గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులు తుదిదశకు చేరుకున్నాయి. శిల్పకళా మండప ప్రాకారాలను భక్తులు తిలకించేందుకు వీలుగా నలువైపులా వీటిని బిగించారు. బయటి ప్రాకారాలతో పాటు లోపలి వైపు ఉన్న మండపాల చుట్టూ వీటిని అమరుస్తారు. మ్యాన్ హోల్స్ పైన ఇత్తడి పలకలు వేయనున్నారు. ఆలయ సన్నిధిలో ఇత్తడి క్యూలైన్లు సిద్ధం చేసేందుకు తిరుపతికి చెందిన నిపుణులతో యాడ అధికారులు చర్చిస్తున్నారు. క్యూ కాంప్లెక్స్ నుంచి ఆలయంలోకి ప్రవేశించే భక్తుల కోసం ఇత్తడి షెడ్లు నిర్మాణానికి గతంలోనే రూపకల్పన చేశారు. ఇత్తడి దర్శన వరుసలను ఉత్సవాల అప్పుడు పక్కకు జరుపుకునేలా తీర్చిదిద్దుతున్నట్లు ఆలయ శిల్పి ఆనంద్ సాయి తెలిపారు.

yadadri
ఆలయ మాడవీధుల్లో ఇత్తడి గ్రిల్స్

కొండపైన బస్ బే పనులు వేగవంతం...

స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులను యాదాద్రి కొండ కింది నుంచి పైకి తీసుకు వచ్చే బస్సులు ఇతర వాహనాలు నిలపడానికి పార్కింగ్ స్థలాన్ని అభివృద్ధి చేస్తున్నారు. కొండపైన ఆర్చ్ నుంచి విష్ణు పుష్కరిణి వరకు గల స్థలాన్ని వాహనాల పార్కింగ్ కేటాయించారు. పార్కింగ్ స్థలం పెంచుకోవడానికి ఇప్పటికే యాదాద్రి కొండకు ఉత్తర భాగంలో కిందనుంచి రిటైనింగ్ వాల్ నిర్మించారు.

ఇదీ చదవండి: కూల్చివేత ఎఫెక్ట్​: ఆలయం, మసీదు దెబ్బతినటంపై సీఎం ​విచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.