మురళీ కృష్ణుడిగా నరసింహుడు
ఉత్సవాల్లో నాలుగో రోజైన సోమవారం ఉదయాన మురళీకృష్ణుడిగా దర్శనమిచ్చిన స్వామివారురాత్రికి హంస వాహనంపై విహరించారు. పాలలో నీటిని వేరు చేసినట్లు... మనుషుల్లో నెలవైన అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అధర్మాన్ని వేరు చేసేలాధర్మ రక్షణ కోసంహంస వాహన సేవ జరిగింది. శ్రీకృష్ణ లీలలు, నరసింహ అవతారాలతో కలిగిన లోక సంరక్షణ పారాయణాలు,వేదాలను పండితులు వివరించారు.
బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టాలుగా భావించే ఎదుర్కోలు ఉత్సవం ఈ నెల 14న జరగనుంది. 15న స్వామి, అమ్మవార్ల కల్యాణం నిర్వహిస్తారు.
ఇవీ చూడండి:లక్ష్మీ నర్సింహస్వామి సన్నిధిలో దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ