యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిపల్లిలో కాటమయ్యకు బోనాల పండుగను నిర్వహించారు. గౌడ కులస్థులు, మహిళలు, యువతులు బోనాలతో ఊరేగింపుగా వచ్చి గ్రామదేవతలకు భక్తిశ్రద్ధలతో మొక్కులు సమర్పించారు. భక్తులు డప్పు చప్పుళ్లు, నృత్యాలతో ఊరేగింపుగా ఆలయానికి తరలివెళ్లి కాటమయ్యకు నైవేద్యం సమర్పించారు. యాదగిరిపల్లి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
- ఇదీ చూడండి : మన కొత్త గవర్నర్ తమిళిసై ప్రస్థానమిదీ...