యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. మండలంలో పలు గ్రామాలకు అనుసంధానమై ఉన్న రహదారుల దుస్థితిపై ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవాట్లేదంటూ భాజపా నాయకులు ఆరోపించారు. ప్రజా సమస్యలను పట్టించుకుని.. వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత తెరాస కార్పొరేటర్లకు ఉందని వారు అన్నారు.
ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల్లో తిరగడం సిగ్గుచేటని భాజపా కార్పొరేటర్లు, సర్పంచ్లు వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యపూరిత వైఖరిని విడనాడకుండా భవిష్యత్తులో ప్రజలే వారికి బుద్ధి చెబుతారన్నారు. ఇప్పటికైనా స్పందించి.. వెంటనే ప్రజలా సమస్యలను పరిష్కరించాలని.. లేనిపక్షంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు.
ఇదీ చూడండి : 'ఆ గ్రామాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతాం'