యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ, అడ్డగూడూరు పోలీస్ శాఖ, స్థానిక యువత సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. సుమారు 80 యూనిట్ల రక్తాన్ని సేకరించి నల్గొండ రెడ్ క్రాస్ రక్తనిధికి అందించారు.
శిబిరాన్ని ప్రారంభించిన భువనగిరి డీసీపీ నారాయణ రెడ్డి రక్తం అవసరం చాలా ఉంటుందని... దీనికి కొరత రాకూడదన్నారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో రక్తం యూనిట్ల కొరత ఉన్నందునే ఈ శిబిరం ఏర్పాటు చేశామన్నారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు నిత్యం రక్తం అవసరం ఉందన్నారు. ఈ మేరకు రక్తదాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
కార్యక్రమంలో భువనగిరి ఏసీపీ బొట్టు కృష్ణయ్య, చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్య, రామన్నపేట సీఐ, మోత్కూర్, అడ్డ గూడూర్ ఏస్సై సీహెచ్ హరిప్రసాద్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ యాదాద్రి భువనగిరి జిల్లా శాఖ చైర్మన్ డాక్టర్ లక్ష్మీ నరసింహా రెడ్డి, ఎంపీపీ అంజయ్య, రెడ్ క్రాస్ జిల్లా డైరెక్టర్ గోవింద్ తదితరులు పాల్గొన్నారు.