సిద్ధిపేట జిల్లాలో దళిత బిడ్డ నర్సింలు ఆత్మహత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని భాజపా యాదాద్రి జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ ఆవేదన వ్యక్తం చేశారు. అతని కుటుంబానికి రూ. కోటి నష్టపరిహారం, మూడు ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో దళితుల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ.. పార్టీ ఆధ్వర్యంలో చౌటుప్పల్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట దీక్ష చేపట్టారు. ఎస్సీల ఓట్లతో గెలిచి వారిని విస్మరించడం సీఎం కేసీఆర్కు తగదని శ్యాంసుందర్ అన్నారు.
ఇవీచూడండి: ఇసుక మాఫియా వెనక ఎంత పెద్ద అండ ఉందో అర్థమవుతోంది: చాడ