ETV Bharat / state

'విగ్రహ పునర్మిర్మాణం తక్షణమే చేపట్టాలి ' - యాదాాద్రిలో భాజపా నిరసన

అభివృద్ధి పేరుతో మూలాలను ధ్వంసం చేస్తే సహించబోమని విశ్వహిందూ పరిషత్​ నాయకులు హెచ్చరించారు. భాజపా ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో పెద్దఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. ధ్వంసమైన యాదవ మహర్షి విగ్రహాన్ని అధికారులు వెంటనే పునర్మించాలని డిమాండ్ చేశారు.

bjp leaders  demands Statue reconstruction must be undertaken immediately in yadadri
'విగ్రహ పునర్మిర్మాణం తక్షణమే చేపట్టాలి '
author img

By

Published : Dec 23, 2020, 4:26 PM IST

పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రిలో యాదవ మహర్షి విగ్రహం ధ్వంసం కావడంపై భాజపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ ఈవో తక్షణమే రాజీనామా చేయాలంటూ యాదగిరిగుట్టలో ర్యాలీ నిర్వహించారు. అభివృద్ధి పేరుతో ఇక్కడున్న మూలాలను ధ్వంసం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

ఆలయ అధికారులు తక్షణమే యాదవ మహర్షి విగ్రహం పునర్మిర్మాణం చేపట్టాలని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి, జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్​ డిమాండ్ చేశారు. పునర్మిర్మాణం పేరుతో నరసింహస్వామి ఆలయాన్ని నామరూపాలు లేకుండా చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే తామే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:'భాజపా పాలిత రాష్ట్రాల్లో ఇన్ని సంక్షేమ పథకాలున్నాయా..?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.