ETV Bharat / state

వరంగల్​ వెళ్తున్న ఎమ్మెల్యే రాజాసింగ్​ అరెస్ట్.. విడుదల

వరంగల్​కు వెళ్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్​ యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. భూదాన్​పోచంపల్లి పోలీస్​ స్టేషన్​కు తరలించిన అనంతరం విడుదల చేశారు. విషయం తెలుసుకున్న భాజపా కార్యకర్తలు స్టేషన్​ వద్దకు చేరుకొని పెద్దఎత్తున నినాదాలు చేశారు.

bibinagar police arrested mla rajasingh and release
వరంగల్​ వెళ్తున్న ఎమ్మెల్యే రాజాసింగ్​ అరెస్ట్.. విడుదల
author img

By

Published : Feb 1, 2021, 4:49 PM IST

వరంగల్​లో ఆదివారం జరిగిన ఘటనకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్​ను యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్​ మండలం కొండమడుగు వద్ద పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం భూదాన్​పోచంపల్లి పోలీస్ స్టేషన్​కు తరలించారు. విషయం తెలుసుకున్న భాజపా కార్యకర్తలు రాజాసింగ్​ను విడుదల చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం రాజాసింగ్​ను పోలీసుల విడుదల చేశారు.

అయోధ్యలో రామమందిర నిర్మాణం రామ భక్తులందరి కార్యక్రమం అని రాజాసింగ్​ అన్నారు. అందుకోసం సేకరిస్తున్న విరాళాలపై పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. 500 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదం పరిష్కారమైందని... ఆలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఆలయ నిర్మాణ వ్యవహారాలు ట్రస్ట్​ ద్వారా జరుగుతాయని... దీనిని రాజకీయం చేయడం తగదన్నారు.

ఇదీ చూడండి: పోలీసుల అదుపులో ఎమ్మెల్యే రాజాసింగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.