భువనగిరి నియోజకవర్గంలో రైల్వే సమస్యలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ అయ్యారు. శాతవాహన, పద్మావతి, గోదావరి, మచిలీపట్నం రైళ్లను భువనగిరి, జనగామ, ఆలేరు రైల్వేస్టేషన్‌లలో ఆపాలని వినతిపత్రం సమర్పించారు. ఈ ప్రాంతాల నుంచి నిత్యం వేలాది మంది హైదరాబాద్ వెళ్తుంటారని వినతిపత్రంలో పేర్కొన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తుల సంఖ్య పెరుగుతున్న రైలు సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని కోమటిరెడ్డి పేర్కొన్నారు. సంబంధిత అధికారులతో సర్వే చేయించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: చెరో దారిలో కోమటి రెడ్డి బ్రదర్స్