యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో తీవ్ర అనారోగ్యంతో ఓ యాచకుడు ప్రాణాలు విడిచాడు. మేడ్చల్ జిల్లా మచ్చ బొల్లారం తిరుమలగిరికి చెందిన లక్ష్మీ నారాయణ.. కొద్ది రోజులుగా యాదగిరిగుట్టలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని.. భిక్షాటన చేస్తూ జీవనం గడుపుతున్నాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మీ నారాయణ.. ఆరోగ్యం క్షీణించి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని భువనగిరి ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
- ఇదీ చూడండి: మనుషులకే కాదు.. శునకాలకూ ఓ 'బ్లడ్ బ్యాంక్'