యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల పరిధిలోని 12 గ్రామాల్లో జాగృతి పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో చట్టాల పట్ల ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నేరాల సంఖ్య తగ్గించేందుకు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ ఆదేశానుసారం ఈ కార్యక్రమం చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

మహిళల అక్రమ రవాణా, బాల్యవివాహలు ,రోడు ప్రమాదాలు, సైబర్ నేరాలు, వృద్ధుల సంరక్షణ, బ్రూణ హత్యలు, కరోనా వంటి తదితర అంశాలపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు అవగాహన కార్యక్రమాలు ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మోత్కూరు ఎస్ఐ ఉదయ్ కిరణ్, పోలీసు సిబ్బందితో పాటు ఆయా గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'మమతపై దాడి జరిగినట్టు ఆధారాల్లేవు'