యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణాపురం మండలంలో గత నెల 29న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న పదోతరగతి విద్యార్థిని కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడు సుక్కాగిరి ప్రేమించమంటూ వేధించటం వల్ల మనస్థాపం చెందిన బాలిన ఆత్మాహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతిరాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపర్చనున్నట్లు తెలిపారు.
ఇవీచూడండి: ఆ బంధానికి అడ్డొస్తున్నాడని.. చంపేశాడు!