యాదాద్రి ప్రధాన ఆలయం పనులను ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయి శనివారం పరిశీలించారు. యాదాద్రి ఆలయ తుదిదశ పనులు వేగంగా నాణ్యతతో చేపట్టాలని సూచించారు. ఆనంద్ సాయి స్థపతులు, కాంట్రాక్టర్లు, అధికారులతో నిర్మాణాల గురించి అడిగి తెలసుకున్నారు.
ప్రధాన ఆలయంలో కృష్ణ శిలలకు రసాయనాల పూత, ప్రాకారాల సాలహారాల్లో ఏర్పాటు చేయాల్సిన కృష్ణుడి వివిధ పాల విగ్రహాల గురించి చర్చించారు. ఆలయం దక్షిణ వైపు చేపడుతున్న ఫ్లోరింగ్, సాయిల్ స్టెబిలైజింగ్ పనులను పరిశీలించారు. ఆలయంలో జరుగుతున్నఎలక్ట్రికల్ పనుల గురించి వైటీడీఏ విద్యుత్ అధికారులను ఆరా తీశారు.
ఆలయంలో పొందుపర్చాల్సిన ద్వారపాలక, గరత్మంతుని విగ్రహాలు ప్రధాన ఆలయం వద్దకు చేర్చారు. ఆలయ సప్త రాజగోపురాల్లో పక్షులు, కోతులు వెళ్లకుండా రక్షణ చేపట్టడానికి గోపురాల పైభాగాల్లో ఉంచిన ఖాళీ స్ధలాల్లో ఇత్తడి గ్రిల్స్ పొందు పరిచే పనులు చేపడుతున్నారు. పరిశీలన సమయంలో ఆయన వెంట ఆలయ స్థపతి ఆనందాచారి వేలు, వైటీడీఏ అధికారులు, ఎస్ఈ వసంత నాయక్, శిల్పులు, స్థపతులు, ఉన్నారు.
ఇదీ చూడండి : తల్లి, అన్నను తుపాకీతో కాల్చి చంపిన మైనర్ బాలిక