యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలోని మండల పరిషత్ కార్యాలయంలో శనివారం జరిగిన సర్వసభ్య సమావేశం ఎంపీటీసీల కోరం లేకపోవడం వల్ల నేటికి వాయిదా వేశారు. నేడూ ఎంపీటీసీ కోరం సభ్యులు ఎవరూ రాకపోవడం వల్ల సమావేశాన్ని మళ్లీ వాయిదా వేస్తున్నట్లు ఎంపీపీ భూక్య సుశీల పేర్కొన్నారు.
గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు గ్రామాల్లో ఉన్న సమస్యలను తెలిపేందుకు ఉన్న ఈ చిన్న అవకాశాన్ని ప్రజాప్రతినిధులు దుర్వినియోగం చేస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనని ఎంపీటీసీలపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇవీచూడండి: సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై స్పీకర్‌కు ఫిర్యాదు: భట్టి