యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలో 40 మంది నిరుపేద చేనేత కార్మికులకు తమ సొంత నిధులతో ప్రముఖ యాంకర్, నటి అనసూయ నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. అనంతరం చేనేత వస్త్రాలు కొనుగోలు చేశారు. లాక్డౌన్ వల్ల చేనేత కార్మికులు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వారికి పోచంపల్లి బిడ్డగా తన వంతు సాయం చేస్తున్నానన్నారు.
కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అనసూయ అన్నారు. చేనేత కళ అద్భుతమైనదని, కళాకారులను మనందరం బతికించుకోవాలన్నారు. వారందరినీ సెలబ్రిటీలు, సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరూ చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి చేనేత పరిశ్రమను ఆదుకోవాలని కోరారు. ఇక ముందు కూడా పోచంపల్లి నేతన్నలకు సాయం చేస్తానని అనసూయ అన్నారు.
ఇవీ చూడండి: వీహెచ్ జన్మదినం సందర్భంగా దుప్పట్లు పంచిన శంభుల శ్రీకాంత్