యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయం దేశంలోనే అద్భుతమైన క్షేత్రంగా రూపుదిద్దుకుంటోంది. ఇందులో భాగంగానే అపురూప శిల్ప సౌరభాలు, పురాణ, ఇతిహాస, ధార్మిక ఘట్టాలను ఆలయ ప్రాకార మండపాలపై పొందుపరుస్తున్నారు.
తెలుగురాష్ట్రాల్లోని ప్రముఖ నారసింహ క్షేత్రాల దివ్య రూపాలు సైతం ప్రధానాలయం మండపాలపై ఆవిష్కృతం కానున్నాయి. యాదాద్రి ప్రధానాలయ ప్రాకార మండపంలో తెలుగు రాష్ట్రాల్లో కొలువై ఉన్న నవనారసింహులతో పాటు తెలంగాణలోని ప్రముఖ నారసింహ ఆలయాల రూపాలను అంతర్ ప్రాకార మండపంపై పొందుపరచనున్నారు.
ఈ మేరకు నవనరసింహ ఆలయాలు అందులో వెలసిన నరసింహుల రూపాలను ప్రధానాలయం,అంతర్ ప్రాకార మండప రాతి స్తంభాలపై త్వరలోనే చెక్కడం ప్రారంభించే అవకాశాలున్నాయని ఆలయ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇదీ చదవండి: 'ఇదంతా తబ్లీగీల వల్లే... వారి నేరాలకు శిక్ష తప్పదు'