ETV Bharat / state

కార్మికులను ఆదుకోవాలని తహశీల్దార్​కు వినతి - యాదాద్రి జిల్లా వార్తలు

లాక్​డౌన్​ సమయంలో వలస కార్మికులు, దినసరి కూలీలను ఆదుకోవాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్​ మండల తహశీల్దార్​కు వినతి పత్రం ఇచ్చారు. లాక్​డౌన్​ వల్ల ఇక్కడే ఇరుక్కుపోయిన వలస కార్మికులకు వసతి కల్పించాలని కోరారు.

All Uninons Request Lettetr To Mothkur Tahashildar For MGNRES Job Card Issue For Migration Labor
కార్మికులను ఆదుకోవాలని తహశీల్దార్​కు వినతిపత్రం
author img

By

Published : Jun 4, 2020, 5:47 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్​లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వలస కూలీలు, పేద కూలీలను ఆదుకోవాలని వినతి పత్రం సమర్పించారు. లాక్​డౌన్​ వల్ల వలస కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, దినసరి కూలీలు, అడ్డ కూలీలు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.

ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలస కూలీలు చాలామంది ఇక్కడే ఉండిపోయారని.. పని లేక.. చేతిలో డబ్బులు లేక తిండికి సైతం ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జాబ్​కార్డ్​ లేక.. ఉపాధి పనులకు కూడా వెళ్లలేక పోతున్నారని.. వారి సమస్యలు గుర్తించి కనీసం జాబ్​ కార్డు ఇచ్చినా.. ఉపాధి పనికి వెళ్లి పొట్ట పోసుకుంటారని ప్రజా సంఘాల నేతలు తహశీల్దార్​ను కోరారు.

ఇదీచూడండి : 40 మంది విద్యార్థులపై కత్తితో దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.