ETV Bharat / state

బాల్యమిత్రుడి కుటుంబానికి భరోసా - మోత్కూర్ మండల వార్తలు

బాల్యమిత్రుడు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న తరుణంలో మేమున్నామంటూ పదో తరగతి స్నేహితులంతా తన కుటుంబానికి అండగా నిలిచారు. తమ వంతుగా 50కేజీల బియ్యం, రూ.25,000 నగదును అందజేశారు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండల కేంద్రంలో జరిగింది.

50 kg of rice and Rs 25,000 cash handed over to their friend's family by 10th bathch mates in mothkur
బాల్యమిత్రుడి కుటుంబానికి మేమున్నామంటూ భరోసా
author img

By

Published : Jan 24, 2021, 7:25 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండల కేంద్రానికి చెందిన చిట్టూరు సందీప్ ఆర్థిక సమస్యలతో ఈనెల 17న హైదరాబాద్​లో ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన చిన్ననాటి స్నేహితులంతా సందీప్ కుటుంబాన్ని పరామర్శించారు. తమ వంతుగా 50కేజీల బియ్యం, రూ.25,000 నగదును అందజేశారు.

కరోనా తీసుకొచ్చిన ఆర్థిక సమస్యలను అధిగమించలేక తమ తోటి విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వీరందరూ కలసి 2005-2006 సమయంలో పదో తరగతి చదువుకున్నారు. ఈ కార్యక్రమంలో మిత్రులు కొంపెల్లి రాజు, బుంగపట్ల మహేశ్​, బీసు వెంకటేశ్, గుంటి ఉపేందర్, కూరేళ్ల రాజు, ప్రవీణ్, రాజు, కొండాపురం రాజు, ఎడ్ల యాకస్వామి, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: కేంద్రప్రభుత్వ వైఖరితో ప్రజలపై భారం : పల్లా రాజేశ్వర్‌ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.