ETV Bharat / state

కారు నెంబర్​ కోసం ఏకంగా రూ.5 లక్షల 10 వేలు

కొత్తగా కొన్న తన కారుకు ఫ్యాన్సీ నెంబర్​ కోసం ఓ వ్యాపారి ఏకంగా రూ.5 లక్షల 10 వేలు వెచ్చించాడు. రవాణా శాఖ అధికారులు రూ.50 వేలుగా నిర్ణయించగా... ఇద్దరు వ్యక్తులు ఆన్​లైన్​లో పోటీపడ్డారు. వేలం నిర్వహించగా... ఇప్పటివరకు యాదాద్రి జిల్లాలోనే అత్యధిక ధర పలికిన నెంబర్​గా రికార్డు నెలకొల్పింది.

5 lakh 10 thousand rupees for a car number
author img

By

Published : Sep 18, 2019, 12:29 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలో రవాణా శాఖ అధికారులు ఫ్యాన్సీ నెంబరు వేలంలో 'టీఎస్​ 30 డీ 9999'ను రూ.5 లక్షల 10 వేలతో బోర్‌వెల్‌ వ్యాపారి రామచంద్రారెడ్డి దక్కించుకున్నారు. జిల్లాలో ఇప్పటివరకు ఇంత ధర వెచ్చించి నెంబర్​ను కొనుగోలు చేయటం ఇదే ప్రథమమని అధికారులు తెలిపారు. రామచంద్రారెడ్డి కొత్తగా కొనుగోలు చేసిన తన కారుకు ఫ్యాన్సీ నెంబరు ఉండాలని పోటీపడి కొనుక్కున్నారు. రవాణా శాఖాధికారులు ఆన్​లైన్​లో ఈ నెంబరు ధరను రూ.50వేలుగా నిర్ణయించారు. ఇటీవల కొత్తగా కార్లు కొన్న యజమానులిద్దరు రూ.50 వేలు దరఖాస్తు ఫీజు చెల్లించి వేలంపాటలో పాల్గొన్నారు. ఈ వేలంలో అత్యధికంగా కోట్‌ చేసిన రాంచంద్రారెడ్డికి నెంబర్‌ను అధికారులు కేటాయించారు. రామచంద్రా రెడ్డి నైజీరియాలో బోర్‌వెల్‌ వ్యాపారం చేస్తున్నాడు.

కారు నెంబర్​ కోసం ఏకంగా రూ.5 లక్షల 10 వేలు

ఇవీ చూడండి: కేసీఆర్ సారూ.. మా గ్రామాలను తెలంగాణలో కలుపుకోండి..

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.