ETV Bharat / state

డాక్టర్‌ చదవాలనుకుంటున్నా.. ఎవరైనా సాయం చేయండి.. ప్లీజ్‌! - డాక్టర్‌ కావాలనుకుని పేదరికం వల్ల కాలేదు

Young Woman got doctor seat is working laborer due to poverty: రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబంలో పుట్టిన ఆ యువతి లక్ష్యం మాత్రం.. పెద్దది. బాగా చదువుకుని డాక్టర్ అయి పదిమందికి సాయం చేయాలనే ఆశయంతో.. కష్టమైనా ఇష్టంతో చదివింది. లక్ష్యం వైపు అడుగులు వేసింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న క్రమంలో అత్యుత్తమ మార్కులతో ఉచిత విద్యను అభ్యసించింది. అదే ఉత్సాహంతో చదివి.. ఏకంగా వైద్య విద్యలో సీటు సంపాదించింది. కానీ అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని గ్రహించిన విద్యార్థి.. ఏమీ తోచక కన్నీటితో.. తల్లిదండ్రలతో కూలీ పనులకు వెళ్లేందుకు సిద్ధమైంది.

Young Woman
వరంగల్‌ యువతి కథ
author img

By

Published : Jan 2, 2023, 10:46 PM IST

డాక్టర్‌ చదవాలనుకుంటున్నా ఎవరైనా సాయం చేయండి ప్లీజ్‌

Young Woman got doctor seat is working laborer due to poverty: హనుమకొండ జిల్లా నడికూడ మండలం ముస్త్యాలపల్లి గ్రామానికి చెందిన బోళ్ల స్వామి,వసంత దంపతుల కుమార్తె సంజన. చిన్నతనం నుంచి చదువులో మేటి. ఇంట్లోఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే. రోజు కూలీ పనికి వెళ్తే కానీ కడుపు నిండని దుస్థితి. దీంతో ప్రాథమిక విద్యను స్థానిక ప్రభుత్వ బడిలో పూర్తిచేసింది. తల్లిదండ్రుల కష్టాన్ని చూసిన ఆమె.. కష్టపడి చదివి తన ప్రతిభతో ఉత్తమ విద్యార్థిగా ఎంపికైంది. దీంతో హనుమకొండలోని సెయింట్ జోసెఫ్ హైస్కూల్‌లో ఉచిత విద్యకు అవకాశం కల్పించారు. పదో తరగతిలో 9.8 జీపీఏ సాధించింది. కరీంనగర్‌లోని ఓ కళాశాలలో బైపీసీ లో చేరిన సంజన.. 988 మార్కులు సాధించింది. గౌల్ దొడ్డి సోషల్ వెల్ఫేర్‌లో ఐదు నెలల కోచింగ్ తీసుకుని నీట్ పరీక్ష రాసి ఎంబీబీఎస్‌కు అర్హత సాధించింది.

"నేను చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాను. మొదటినుంచి మంచి ప్రతిభ కనబరచడం వల్ల హనుమకొండలోని సెయింట్‌ జోసెఫ్‌ స్కూల్‌లో సీటు వచ్చి 10వ తరగతి వరకు చదువుకున్నాను.. 10వ తరగతిలో 9.8 పాయింట్లు వచ్చాయి. ఇంటర్‌లో 988 మార్కులు వచ్చాయి. తరవాత ఐదు నెలలు నీట్‌ ఎగ్జామ్‌కు కోచింగ్‌ తీసుకున్నాను. నీట్‌లో స్టేట్‌ ర్యాంకు 9000లో వచ్చింది. దీంతో సిద్ధిపేటలోని మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ సీటు వచ్చింది. ఆ పరిస్థితి బాగోలేక.. అమ్మనాన్నలతో కలిసి కూలి పనికి వెళుతున్నాను. నా ఆశయం ఎంబీబీఎస్‌ చదివి.. పేదలకు సహాయం చేయాలి." - సంజన, విద్యార్థిని

పిల్లలు బాగా చదివి ఉన్నతస్థాయికి ఎదుగుతారనే ఆశతో.. కూలీ పనులు చేసుకుంటూ.. స్వామి,వసంత దంపతులు కష్టమైన చదివిస్తున్నారు. సంజనకు సిద్దిపేట జిల్లాలోని సురభి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్‌ సీటు వచ్చింది. వైద్యవిద్య.. ఖర్చుతో కూడుకున్న వ్యవహారమైనా.. బిడ్డ కోసం రూ.1.20 లక్షలు అప్పుచేసి కళాశాలలో చేర్పించారు. సంజన కాలేజీకి వెళ్లాలంటే.. మరోలక్ష రూపాయలు అవసరం. ఆ తల్లిదండ్రుల దగ్గర అంత డబ్బు లేక.. బిడ్డను చదువు మన్పించి.. వారితోపాటు కూలీ పనులకు తీసుకెళ్లున్నారు.

"మా పాపకు ఎంబీబీఎస్‌ సీటు వచ్చింది. ఎంబీబీఎస్‌ చదివించేందుకు మా వద్ద అన్ని డబ్బులు లేక.. ఎవర్ని అడిగిన మళ్లీ అప్పు తిరిగి చెల్లించే స్తోమత లేక చదువు ఆపేశాము. పాప మళ్లీ చదువు తానూ అని పట్టుబడితే.. చదివిద్దామనుకుంటున్నాము. మేము నెల రోజులు సంపాదించిన ఆమె పుస్తకాలకు కూడా సరిపోవు. అడ్మిషన్‌ గురించి అక్కడో ఇక్కడో అప్పు చేసి కట్టాము. డబ్బులు లేక మా బిడ్డను పనికి తీసుకుపోతున్నాము. పెద్దలు ఎవరైనా సాయం చేయాలని కోరుకుంటున్నాము." - బోళ్ల వసంత, సంజన తల్లి

కొందరు తల్లిదండ్రులు పిల్లల కోసం లక్షలు ఖర్చు చేసి.. కోచింగ్‌కు పంపినా వైద్య విద్యలో సీటు సాధించలేకపోతున్నారు. అలాంటిది సంజన చిన్నప్పటి నుంచి ప్రభుత్వ బడిలో చదువుకుని.. ఇంట్లో తల్లిదండ్రులకు సాయం చేస్తూ.. మెడికల్‌ సీటు సాధించడం గొప్పగా భావిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. బాగా చదువుకుని డాక్టర్‌ కావాలనుకుంటున్నా సంజనకు.. ఎవరైన దాతలు సహాయం చేస్తే.. పేదింటి అమ్మాయి భవిష్యత్‌కు బాటలు వేసినవారవుతారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.